తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৪, ২০২৬, ১০:৩৭ পি.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ৪, ২০২৬, ৩:০২ পি.এম
BREAKING NEWS

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా 5 గురు ఎంపిక.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా 5 గురు ఎంపిక.

కోటనందూరు జిల్లా వాణి ప్రతినిధి

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో 5గురు ఉపాధ్యాయులు ఎంపికైనట్లు ఎంఈఓ ఏ శ్రీనివాసరావు తెలియజేశారు. కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ కే వీరభద్రరావు, పాత కొట్టాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ కే ఎన్ వి సింగరాజు, ఎస్ఆర్ పేట ఎంపీపీ స్కూల్ లో పనిచేస్తున్న ఎస్ జి టి పొలమరశెట్టి ఇందూ దేవి, టి జే నగరం ఎంపీపీ స్కూల్ లో పనిచేస్తున్న ఎస్జీటీ షేక్ తాజుద్దీన్ బాబా, అల్లిపూడి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ సుర్ల సుమ ఎంపిక అయ్యారు. గురుపూజోత్సవం సందర్భంగా కాకినాడలో జరిగే ఒక కార్యక్రమంలో వీరికి అవార్డులు అందజేస్తారు. ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎన్నికైన వీరిని పలువురు ప్రజాప్రతినిధులు తోటి ఉపాధ్యాయులు ఉన్నతాధికారులు అభినందించారు.