2026: సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ అనకాపల్లి అధ్యక్షుల ఆధ్వర్యంలో 04 సెప్టెంబర్ 2026న నర్సీపట్నంలోని పద్మావతి కళ్యాణ మండపంలో సర్వసభ్య సమావేశం మరియు నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈఎన్నికల ప్రక్రియకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అబ్జర్వర్‌గా శ్రీ త్రిమూర్తులు గారు, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున అబ్జర్వర్‌గా శ్రీ సి.హెచ్. సత్యనారాయణ గారు, రిటర్నింగ్ అధికారిణిగా అడ్వకేట్ శ్రీమతి సి.హెచ్. గీత పాల్గొని ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.నూతన కార్యవర్గం:
అధ్యక్షుడిగా శ్రీ చిట్టికెల్ల తారక వేణుగోపాల్
ప్రధాన కార్యదర్శిగా శ్రీ పి. నూకరాజు ,
కోశాధికారిగా శ్రీ శెట్టి లోవ
ఉపాధ్యక్షులుగా శ్రీమతి ఈ. భీమలక్ష్మి గారు మరియు శ్రీ లగుడు వెంకట రమణ
సంయుక్త కార్యదర్శులుగా శ్రీమతి ఎస్. శ్రీ సౌమ్య గారు మరియు శ్రీ వి. రాము ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గానికి సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా శ్రీ వెలగా వెంకట కృష్ణారావు , చైర్మన్‌గా శ్రీ శెట్టి సతీష్ , ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీ డి. రవి , కన్వీనర్‌గా శ్రీ కోట సతీష్ నియమితులయ్యారు.సమావేశంలో పాల్గొన్న సభ్యులు నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, జిల్లా వ్యాప్తంగా సాఫ్ట్‌బాల్ క్రీడాభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. యువ క్రీడాకారులు పోటీల్లో సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
