తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৫, ২০২৬, ৮:৫৫ এ.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ৫, ২০২৬, ১:৩৪ এ.এম
BREAKING NEWS

79 కోట్లతో రోలుగుంట ఆర్ ఎన్ బి రోడ్డు పునర్నిర్మాణ పనులకు శ్రీకారం. న్యాన్యతలో రాజీ పడవద్దు అంటున్న ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు.

79 కోట్లతో రోలుగుంట ఆర్ ఎన్ బి రోడ్డు పునర్నిర్మాణ పనులకు శ్రీకారం. న్యాన్యతలో రాజీ పడవద్దు అంటున్న ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు.

“79 కోట్లతో.రోలుగుంటలో రహదారి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం.నాణ్యతలో రాజీ వద్దు: ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు:

ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థకు చేరి వాహనదారులు, ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న రోలుగుంట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పునర్నిర్మాణ పనులకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టనున్నారు.ఈ రహదారి పునర్నిర్మాణ పనులు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆర్‌అండ్‌బీ సెక్షన్ ఇంజనీర్ జాన్ సుధాకర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు సూచించినట్లు తెలిపారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని, నిర్మాణ పనులను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించినట్లు వెల్లడించారు.రోడ్డు పునర్నిర్మాణంపై ప్రజల్లో హర్షంఏళ్లుగా ప్రధాన రహదారి దుస్థితితో ఇబ్బందులు పడుతున్న రోలుగుంట మండల ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు పనులు ప్రారంభం కానుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పునర్నిర్మాణం పూర్తయితే రాకపోకలు సులభతరం కావడంతో పాటు వాహనదారుల ఇబ్బందులు తగ్గుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా రోలుగుంట తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు పంచాడ చంద్ర, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గుమ్ములూరి చంద్రమౌళి, రోలుగుంట ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. రోలుగుంట రహదారి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టేందుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రహదారి సమస్యకు పరిష్కారం చూపినందుకు సీఎం చంద్రబాబు నాయుడిని అభినందించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.