తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৬, ২০২৬, ১২:০৫ পি.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ৫, ২০২৬, ৮:০৮ এ.এম
BREAKING NEWS

శ్రీకృష్ణుడి బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం:నర్సింగరావుపేటలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు ప్రారంభం

శ్రీకృష్ణుడి బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం:నర్సింగరావుపేటలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు ప్రారంభం

అనకాపల్లి:జిల్లావాణి అనకాపల్లిలో నర్సింగరావుపేట శ్రీకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో తొలిరోజు శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠా పూజతో పాటు ఉట్టి సంబరాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య వేడుకలు కన్నులపండువగా సాగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌డీ గ్రూప్స్ అధినేత, దుర్గమ్మ సేవకుడు, కృష్ణయ్య సాధకుడు కాండ్రేగుల శ్రీరామ్ హాజరై స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉట్టి కొట్టి ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుడి జీవితం, బోధనలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ధర్మాన్ని కాపాడుతూ, భక్తి, మానవతా విలువలను జీవితంలో ఆచరించడమే శ్రీకృష్ణుడికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు అందించిన సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆకాంక్షించారు.నర్సింగరావుపేటలో శ్రీకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న జన్మాష్టమి వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేయాలని శ్రీరామ్ ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. తొలిరోజు వేడుకలు భక్తి, ఉత్సాహంతో విజయవంతంగా ముగిశాయి.