తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৬, ২০২৬, ১২:০৯ পি.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ৫, ২০২৬, ৮:৫১ এ.এম
BREAKING NEWS

రత్నంపేటలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు. విద్యార్థులకు చాక్లెట్స్, బిస్కెట్లు పెన్సిల్లు పంపిణి.

రత్నంపేటలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు. విద్యార్థులకు చాక్లెట్స్,  బిస్కెట్లు పెన్సిల్లు పంపిణి.

విద్య గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ రత్నంపేట గ్రామంలో జనసేన యువత ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ఎంపీపీ పాఠశాలలోని విద్యార్థులకు ఆల్ఫాబెట్ చార్ట్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, పెన్సిళ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జనసేన యువత మాట్లాడుతూ.. జీవితంలో విజయం సాధించిన తర్వాత స్నేహితులతో గెట్‌టుగెదర్ నిర్వహించుకోవడం మాత్రమే కాకుండా, తమ విజయానికి వెనుక నిలిచిన గురువులను గుర్తు చేసుకుని వారిని కలవాలని విద్యార్థులకు సూచించారు.“మన విజయానికి భుజం తట్టిన గురువును ఎప్పటికీ మర్చిపోవద్దు. గురువును గుర్తుపెట్టుకోలేని విద్యార్థి అనాథతో సమానం. తల్లిదండ్రుల తర్వాత మనకు దైవ స్వరూపంగా కనిపించేది గురువు మాత్రమే. అలాంటి గురువులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి” అని విద్యార్థులకు సందేశం ఇచ్చారు.అనంతరం విద్యార్థులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. రత్నంపేట ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ఐడెంటిటీ కార్డులను అందజేస్తామని జనసేన యువత హామీ ఇచ్చింది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, యువత పెద్దాడ నాగేశ్వరరావు, శనివాడ సోమల నాయుడు, బత్తిన సన్యాసిరావు, బత్తిన ప్రసాద్, సిరిసిపల్లి శివ, అంజూరి సతీష్, ఈదల నాగేశ్వరరావు, కోమట లింగ రమేష్, బుదిరెడ్ల రవి, అంజూరి గణేష్, ఒంటెపు సాగర్, ఈదల అర్జున్ తదితరులు పాల్గొన్నారు.