
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రంపచోడవరం నియోజవర్గం రాజవొమ్మంగి మండలం జడ్డంగి వాల్మీకి నగర్ లోని స్థానిక లూధరన్ ఎయిడెడ్ పాఠశాలలో శనివారం ఉదయం సర్వేపల్లి రాధాకృష్ణన్

జయంతి ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఎయిడెడ్ పాఠశాలలోని ఉపాధ్యాయులను ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు సమక్షంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక లూధరన్ సంఘం రెవరెండ్ పాస్టర్ నక్కా ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం స్థానిక ఉపాధ్యాయులు పుట్టపల్లి ఏసుబాబు మరియు కొక్కుల ఝాన్సీ లను విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పూలమాలలు వేసి వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఉపాధ్యాయులు పుట్టపల్లి ఏసుబాబు మరియు కొక్కుల ఝాన్సీ లను ఉద్దేశించి మాట్లాడుతున్న వారిసేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో జడ్డంగి పిసా చట్టం ఉపాధ్యక్షుడు దబ్బా దివాకర్ స్థానిక గ్రామ పెద్దలు దబ్బా దేవదాసు, ముంగారి అమ్మన్న, ముడుసు విజయ కుమార్ , కమలబత్తుల రవి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.