తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৭:৩৫ পি.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ২৪, ২০২৬, ৮:৩০ এ.এম
BREAKING NEWS

గ్రామంలో సందర్శించే స్వచ్చ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోండి

గ్రామంలో సందర్శించే స్వచ్చ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోండి

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం మండలం తామరపల్లి పంచాయతి తామరపల్లి గ్రామంలో స్వచ్చ రథాన్ని ముసురుమిల్లి ఎంపీటీసీ వంశి చేతుల మీద ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొని వచ్చిని స్వచ్చ రథాన్ని రోజుకొక గ్రామాన్ని సందర్శించడం జరుగుతుందని దీనినీ గ్రామ పంచాయతి ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ యొతర వస్తువులు స్వచ్చ రథం ఇచ్చి ఇంటికి అవసరమైన నిత్యావసర సరుకులు తీసుకొనేలా ప్రభుత్వం తీసుకొచ్చిన చక్కటి అవకాశాన్ని ప్రజలు ఉపయోగించూసుకోవాలని ఎంపీటీసీ సూచించారు. ఈకార్యక్రమంలో పిసా ఉపఅధ్యక్షులు వేమన్న ఇంచార్జి పంచాయతి కార్యదర్శి కామరాజు సోదే అబ్బులు తదితరులు పాలొగొన్నారు.