తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১০:৫৫ এ.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ২৫, ২০২৬, ১:২৪ এ.এম
BREAKING NEWS

రోలుగుంట కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ.

రోలుగుంట మండలం కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలపంపిణీ

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మంగళవారం అధికారి మండల ఆరోగ్య విస్తరణ గోవిందరావు, వైద్య నిపుణులు శ్రావణి, గోపికృష్ణలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వారం రోజుల ముందు నిర్వహించిన కంటి పరీక్షల ఆధారంగా అవసరమైన విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైనది. మండల ఆరోగ్య శాఖ అధికారుల సహకారానికి ధన్యవాదాలు" అని తెలిపారు. వైద్య నిపుణులు శ్రావణి మరియు గోపికృష్ణలు పరీక్షల సమయంలో విద్యార్థుల కంటి సమస్యలను గుర్తించి, సరైన చికిత్స సలహాలు కూడా ఇచ్చారు.