తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ১২:৪৮ পি.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ২৬, ২০২৬, ২:৪৫ এ.এম
BREAKING NEWS

మన్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు

మన్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం డివిజనల్ రాజవొమ్మం గి మండల పోలీసు సర్కిల్ లోని జడ్డంగి పీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ చినబాబు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఎగువ ప్రాంతం నుండిదిగువ ప్రాంతాలకు గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న గంజాయినీ అరికట్టేందు, గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూన్నారు. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్ ఎదుట ఉన్న ప్రత్యేక వాహన తనిఖీ వద్ద బుధవారం వాహన తనిఖీలు జడ్డంగి ఎస్ఐ చినబాబు అధ్వర్యంలో నిర్వహించా రు. ఇదే క్రమంలో ద్విచక్ర వాహనాదారులతో మాట్లాడుతూ ప్రయాణ సమయంలో కచ్చితంగా శిరస్త్రం ధరించాలని, ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనానికి సంబంధించిన కాగితాలు తప్పనిసరిగా కూడా ఉండాలి కోరారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపరాదని వారికి సూచించారు.