తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ১২:০০ পি.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ২৭, ২০২৬, ২:৪০ পি.এম
BREAKING NEWS

విద్యార్థులు నైపుణ్యంతో కూడిన విద్యనభ్యసించి ఉన్నత స్థాయి కి ఎదగాలి.

విద్యార్థులు నైపుణ్యంతో కూడిన విద్యనభ్యసించి ఉన్నత స్థాయి కి ఎదగాలి.

కోటనందూరు జిల్లా వాణి ప్రతినిధి
మంచి నైపుణ్యముతో కూడిన విద్యనభ్యసించి చదువుకున్న గురుకులానికి,ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చి మీ భవిష్యత్తు జీవితానికి మంచి పునాదులు వేసుకోవాలని ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లా, తుని లోవ కొత్తూరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గత సంవత్సరం 2024-25 10వ తరగతి బ్యాచ్ మన గురుకులానికి మంచి పేరు ప్రతిష్టలు రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చారని 100% ఉత్తీర్ణత సాధించి 500 మార్కులు పైబడి 13 మంది సాధించారని వీరు త్రిబుల్ ఐటీ, అగ్రికల్చర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంటినరీ కాలేజీల్లో అడ్మిషన్లు పొందారని ఈ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ మంచి పేరు తెచ్చే విధముగా మంచి ఉత్తీర్ణత సాధించి మీ భవిష్యత్తు జీవితానికి మంచి పునాదులు వేసుకుని జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని దీవించి, మీరు ఏ స్థాయిలో ఉన్న తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను, చదువుకున్న గురుకులాన్ని మర్చిపోకూడదని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ప్రిన్సిపాల్ ను ఘనముగా సత్కరించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గురుకులం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.