తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১১:৫০ এ.এম ప్రచురణ తేదీ: মার্চ ২, ২০২৬, ৩:৪১ পি.এম
BREAKING NEWS

పవన్ కళ్యాణ్ శ్రేయస్సు కై జన సైనికుడు పాదయాత్ర

పవన్ కళ్యాణ్ శ్రేయస్సు కై జన సైనికుడు పాదయాత్ర

నక్కపల్లి, జిల్లావాణి

ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవాలని అలా జరిగితే పెందుర్తి నుండి అమరావతి కి పాదయాత్ర గా వస్తానని పెందుర్తి కి చెందిన జనసైనికుడు మెగా వీరాభిమాని దుర్గా కృష్ణ చైతన్య ప్రతిజ్ఞ చేసాడు.అనుకున్నట్టుగానే పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో సుమారుగా 400 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాడు. ఈ పాదయాత్ర సోమవారం నక్కపల్లి చేరుకున్న సందర్బంగా మండల జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివ దత్ సూచన మేరకు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఆకేటి గోవిందరావు ఆధ్వర్యంలో దుర్గ కృష్ణ చైతన్య కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క జనసైనికులు బాధ్యత తో పనిచేయాలని పవన్ కళ్యాణ్ ఆశయాలు తో పార్టీ మరింతగా బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపమాక జనసేన పార్టీ అధ్యక్షులు పాము గణేష్, ఎలమంచిలి చంద్రరావు,పవన్,శ్రీను,వరహాలు తదితరులు పాల్గొన్నారు