తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৮:৫৫ পি.এম ప్రచురణ తేదీ: মার্চ ৩, ২০২৬, ২:২৮ এ.এম
BREAKING NEWS

తక్షణమే బిల్డింగ్ వర్కర్స్ హెల్పర్ బోర్డు పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలి డిమాండ్లతో మార్చి 6 వ తేదీన చలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలు జయప్రదం చేయండి కోరిన సిఐటియూ

అచ్చుతాపురం మండలం లో జరిగిన భవనిర్మాణ కార్మికుల సమావేశాలలో సిఐటియు నాయకులు పాల్గొనడం జరిగింది

ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు మాట్లాడుతూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రధానంగా మూడే 1 సహజ మరణం, మట్టి ఖర్చులు .2.డెలివరీ 3.పెళ్లి కానుకలే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కీలకమైన అంటే మూడు డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేదు 1. 2020 సెప్టెంబర్ ముందు నాటికి రాష్ట్ర ప్రభుత్వం షూరిటీ చేసిన క్లైములు చెల్లించాలి. 2. 2020 సెప్టెంబర్ 7 నుండి ఇప్పటివరకు అర్హులైన కార్మికులకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి,3.ప్రమాద బీమా తప్పనిసరిగా అమలు చేయాలని. సంక్షేమ బోర్డు ద్వారా గతంలో అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ప్రమాదం మరణానికి ఇచ్చే ఆర్థిక సహాయం ఐదు లక్షల నుండి 10 లక్షల వరకు పెంచాలి సిఐటియు డిమాండ్ చేస్తుంది లేనియెడల కార్మికుల ఐక్యం చేసి పోరాటాలు ఉదృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ అప్పలనాయుడు కె రాజు రమేష్ లక్ష్మణ్ రాజు పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు