తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ১০:০০ পি.এম ప్రచురణ తేదీ: মার্চ ৩, ২০২৬, ৯:৩৯ এ.এম
BREAKING NEWS

రావులపాలెంలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు

రావులపాలెంలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు

రావులపాలెంలో హోలీ పండుగ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధులు, కాలనీలు రంగుల హరివిల్లుల్లా మారాయి. చిన్నారులు, యువతీ యువకులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.
ఉదయం నుంచే యువకులు గుంపులుగా చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.హోలీ పండుగ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు శాంతియుతంగా, శాంతియుత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవడం విశేషం.