ఐదేళ్లుగా పలారిలో ఉన్న గంజాయి కేసు ప్రధాన నిందితుడు అరెస్టు.


ఐదేళ్లుగా పోలీసులను తప్పించుకుని తిరుగుతున్న గంజాయి కేసు ప్రధాన నిందితుడిని రోలుగుంట పోలీసులు చివరికి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పరారీలో ఉన్న నేరస్థులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేయగా, ఈ క్రమంలో 2022 మేలో మారుతి కారులో 60 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేసు (Cr.No.108/2022)లో ప్రధాన నిందితుడైన రత్నంపేటకు చెందిన అర్లి గణేష్ (తండ్రి: రాజారావు) అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో అప్పట్లో ఐదుగురిని అరెస్ట్ చేసినప్పటికీ, గణేష్ మాత్రం పోలీసుల కంటపడకుండా తప్పించుకున్నాడు.తాజా విచారణలో నిందితుడు సామర్లకోటలో ఉన్నాడన్న విశ్వసనీయ సమాచారం అందడంతో, పోలీసులు అక్కడికి చేరుకుని చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు.ఇక అర్లి గణేష్‌పై గతంలో నమోదైన రెండు గంజాయి కేసుల్లో (Cr.No.62/2016, Cr.No.79/2017) నాన్-బెయిలబుల్ వారెంట్లు (NBWలు) పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన కొత్తకోట సీఐ జి. కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్ఐ రామకృష్ణారావు మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు.