HomeUmmadi Alluri Zillaరక్తసికమైన మన్యం రహదారి, రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి

రక్తసికమైన మన్యం రహదారి, రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రంపచోడవరం నియోజవర్గ పరిధిలోని జాతీయ రహదారిపై ముమ్మరంగా రోడ్డు ప్రమాదాలు ఎప్పటికప్పుడు సంభవిస్తున్నాయి. పూర్తి వివరాలలోకి వెళితే రెండు రోజుల

వ్యవధిలో రెండు రోడ్డు ప్రమాదాల సంబంధించి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గంగవరం మండల పరిధిలోని ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందిన ఘటన మన్యవాసులు మరువకముందే రాజవొమ్మంగి మండలం జడ్డంగి స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో 516 ఈ హైవే రోడ్డు పై శుక్రవారం జరిగిన ప్రమాదంలో మోహన్ కృష్ణ అనే కానిస్టేబుల్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ కుడికాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక జడ్డంగి వైద్యురాలు పావని ఘటనా స్థలం వద్దకె చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి అనంతరం ఆయనను హుటాహుటిన అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. ఈ ఘటనపై రాజవొమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసినాయుడు, జడ్సడంగి బ్ ఇన్స్పెక్టర్ చిన్నబాబు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇదే క్రమంలో రోడ్డు ప్రమాద ఘటనపై రంపచోడవరం డివిజనల్ డీఎస్పి అశ్రఫ్ అలీ శుక్రవారం రాత్రి అక్కడికి చేరుకొనీ ప్రమాదం జరిగిన స్థలాన్ని నేరుగా సందర్శించి యాక్సిడెంట్ ప్రమాదాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇది ఇలా ఉండగా అనునిత్యం ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటిని నివారించడంలో మాత్రం అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. మన్యం ప్రాంతంలో నూతనంగా వచ్చిన జాతీయ రహదారి వల్ల రవాణా సులభతరం అవుతుందని సంతోషపడాలా..? లేదా ఇదే రహదారిపై ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్న కుటుంబాలు వీధిన పడుతున్నాయని బాధపడాలో తెలియని సంసిద్ధంలో గిరిజన ప్రాంత ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. ఏది ఏమైనా జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించడానికి మాత్రం రోడ్డు రవాణా శాఖ కచ్చితమైన చర్యలు చేపట్టి ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు వారు ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments