HomeUncategorizedజగ్గంపేటలో నీట మునిగిన 250 ఎకరాల పంట పొలాలు.. కౌలు రైతుల కన్నీటి వేదన

జగ్గంపేటలో నీట మునిగిన 250 ఎకరాల పంట పొలాలు.. కౌలు రైతుల కన్నీటి వేదన

జగ్గంపేట, కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలంలోని అకాల వర్షాల కారణంగా జగ్గంపేటలో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన ప్రాంతానికి సమీపంలో ఉన్న సుమారు 250 నుండి 300 ఎకరాల చేతికొచ్చిన పంట పొలాలు నీట మునిగినా.. ఇటు అధికార యంత్రాంగం పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. పొట్ట దశలో ఉన్న వరి చేను నీట మునిగిపోవడంతో కష్టపడి సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతున్నారు.

రైతుల ప్రధాన సమస్యలు మరియు ఆవేదన:

  • ​శాశ్వత పరిష్కారానికే డిమాండ్: దివానం రోడ్డు దగ్గర ఉన్న వంతెనను వెంటనే పూర్తి చేసి, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ప్రతిసారీ అధికారులు వచ్చి ఫొటోలు తీసుకుని వెళ్లడం మినహా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
  • ​కౌలు రైతుల దయనీయ పరిస్థితి: ఇక్కడ సొంత రైతుల కంటే కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారు. సొంత భూమి ఉన్నవారికి ప్రభుత్వ సాయం, రైతు భరోసా, సబ్సిడీలు అందుతున్నాయని.. కానీ తమ నుంచి మాత్రం యజమానులు ఏటా కౌలు (సిస్తు) వసూలు చేస్తున్నారని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • ​నష్టపరిహారంలో అన్యాయం: పంట నష్టపోతే కనీసం ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం కూడా తమకు దక్కడం లేదని, సొంత రైతులే వాటిని తీసుకుంటున్నారని కౌలు రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలతో సర్వం కోల్పోయిన తమ గోడు ప్రభుత్వానికి ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

​ప్రభుత్వానికి విజ్ఞప్తి:

​ఈ విపత్కర పరిస్థితుల్లో తమను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అలాగే జ్యోతుల నవీన్ స్పందించి తక్షణమే స్పష్టమైన హామీ ఇవ్వాలని.. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జగ్గంపేట కౌలు రైతులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments