HomeUncategorizedజగ్గంపేటలో కూటమి జైత్రయాత్ర ఖాయం: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధీమా

జగ్గంపేటలో కూటమి జైత్రయాత్ర ఖాయం: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధీమా

కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 27: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి విజయఢంకా మోగించేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు సర్వసన్నద్ధమయ్యాయి. రావులమ్మ నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. స్థానిక శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. క్లీన్ స్వీపే లక్ష్యంగా… రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. కూటమి విజయం కోసం మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని, పార్టీ గెలుపు కోసమే కొందరు టికెట్లను త్యాగం చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన 30 వేల అభివృద్ధి పుస్తకాలను ఈ నెల 30 నుండి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు, సమర్థులైన అభ్యర్థుల ఎంపికకు ప్రతి మండలానికి నలుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. జగ్గంపేటకు అడపా భరత్, కిర్లంపూడికి కందుల చిట్టిబాబు, గోకవరానికి ఎస్వీఎస్ అప్పలరాజు, గండేపల్లికి మారిశెట్టి భద్రం లు ఈ కమిటీలకు నాయకత్వం వహిస్తారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ, ఆలయ అభివృద్ధి కమిటీల చైర్మన్లు, నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments