
రిపోర్టర్ రఘురామ శేషు :అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది గత 25 సంవత్సరాలుగా కత్తులు దూసుకున్న ఇరు పార్టీలు ఈరోజు ఒక వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం అందరిలో ఆశ్చర్యం కలిగించింది ఇరువర్గాలు యువకులు మార్పు కోరుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా గ్రామ పెద్దగా ఉన్న వీసం అప్పలస్వామి నాయుడు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయం ఎటువంటి గొడవలు తావు లేకుండా ఇరు వర్గాలకు సమన్వయం చేసే ఈ వ్యక్తిని కూడా అందరికీ అర్షనీయం యువత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గ్రామానికి శుభ పరిమాణం అని గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు వీసం అప్పల స్వామి నాయుడు గారికి శ్రీమతి వెంకట సాయి లక్ష్మి, గ్రామ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామం మొత్తం పాల్గొని కొత్త తరానికి నాంది పలికారు
