రావులపాలెం జిల్లా వాణి ప్రతినిధి: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా సహస్రలింగ దర్శనం
రావులపాలెం: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రావులపాలెంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ కేంద్రంలో బ్రహ్మభోజనాల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కేంద్రం ఇన్ఛార్జి భవాని అక్కయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సహస్రలింగ దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా భవాని అక్కయ్య మాట్లాడుతూ కార్తీక మాసంలో జ్యోతికి విశేష ప్రాధాన్యం ఉందన్నారు. దేహాన్ని ప్రమిదగా, అందులో వెలిగే జ్యోతిని ఆత్మగా, ఆత్మజ్యోతి నిరంతరం ప్రకాశించేందుకు అవసరమైన ఇంధనాన్ని జ్ఞానంగా అభివర్ణించారు. కలియుగంలో అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేందుకు పరమాత్మ శివుడిని స్మరిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే కార్తీక జ్యోతి అంతరార్థమని వివరించారు.
కార్యక్రమంలో కాకినాడకు చెందిన బీకే చంద్రకళ అక్కయ్య, బీకే గాయత్రి అక్కయ్య, రావులపాలెం ఛాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు పోతంశెట్టి కనికి రెడ్డి, మల్లిడి వెంకటరెడ్డి, వెలగల శ్రీనివాసరెడ్డి, గొలుగూరి వెంకటకృష్ణారెడ్డి, (చిన్న అబ్బులు) తేతలి సత్యనారాయణ రెడ్డి, పడాల శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రావులపాలెం బ్రహ్మకుమారి కేంద్రంలో బ్రహ్మభోజనాలు
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
