పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: గ్రామ స్థాయి అభివృద్ధికి గ్రామ పంచాయతీ సర్పంచ్ ల పాత్ర అత్యంత కీలకమని రంప ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. అడ్డతీగల మండలంలో

మంగళవారం ఆమె సర్పంచ్ అభ్యర్ధుల గెలుపుకోసం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆమెకు స్థానిక నేతలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దొరమామిడి పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా పోటీలో ఉన్న అభ్యర్థి మిరియాల నాగమణి గారి గెలుపుకోసం ఆమె పంచాయితీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పై చైతన్యం చేశారు. ప్రతీ గ్రామంలో అభివృద్ధి కావాలంటే ప్రాముఖ్యంగా సర్పంచ్ అభ్యర్ధుల గెలుపుకోసం కృషి చేయాలని సూచించారు. సర్పంచ్ లు గెలిస్తే స్థానిక స్థాయిలోనే సమస్యల పరిష్కారానికై చర్యలు చేపట్టే వెసలుబాటు ఉంటుందన్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీ ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయించిన అభ్యర్ధుల గెలుపుకు సహకరించాలన్నారు. అలాగే మిరియాల నాగమణి కి కేటాయించిన గుర్తులపై ఓటువేసి గెలిపించాలని అలాగే వార్డు మెంబర్లను గెలిపించాలని కోరారు.ఈకార్యక్రమంలో ఆమె వెంట గోకురుబోయిన అరుణ తదితరులు పాల్గొన్నారు.
