కాకినాడ జిల్లా, జగ్గంపేట, నవంబర్ 24 : జగ్గంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ బలపరిచిన అభ్యర్థి పాండ్రంగి సురేఖ రాంబాబు జగ్గంపేట శివారు సీతానగరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి వెళ్లి మంచం గుర్తుపై తమ అమూల్యమైన పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని, 18 వ వార్డు సభ్యురాలు ముత్యాల వరలక్ష్మికి గౌను గుర్తుపైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఓటర్లు కూడా ఎక్కడికక్కడ సురేఖ రాంబాబుకు మద్దతు పలుకుతూ పూలమాలతో ఘన స్వాగతం పలికారు.అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుంటే రాబోయే కాలంలో గ్రామాలు మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మరిన్ని నిధులు తెచ్చి గ్రామాల అభివృద్ధికి సహకరిస్తారని సర్పంచ్ అభ్యర్థి సురేఖ రాంబాబు ఓటర్లకు తెలియజేశారు.గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి వీధికి అభివృద్ధి చేరేలా కృషి చేస్తానని సురేఖ రాంబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జీను మణిబాబు, సీనియర్ టిడిపి నాయకులు మారిశెట్టి భద్రం, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఎంపీటీసీ సభ్యులు కోడూరి సత్యనారాయణ, ముత్యాల సత్యనారాయణ, తాతినేని నాగేశ్వరరావు, కాకర్ల కృష్ణాజి, పిండి రెడ్డమ్మ, గూడపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


