HomeUncategorizedమల్లిసాల ఉప సర్పంచ్ గా జనసేన నేత మడక అమర జ్యోతి శ్రీను ఏకగ్రీవ ఎన్నిక

మల్లిసాల ఉప సర్పంచ్ గా జనసేన నేత మడక అమర జ్యోతి శ్రీను ఏకగ్రీవ ఎన్నిక

కాకినాడ జిల్లా, జగ్గంపేట, నవంబర్ 25 : జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ ఉప సర్పంచ్ గా జనసేన పార్టీకి చెందిన మడక అమర జ్యోతి శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ ముండ్రు కృష్ణారావు ఎర్రబాబు, 14 మంది వార్డు సభ్యులు, గ్రామ కూటమి నాయకులు ఏకాభిప్రాయంతో ఆయనను ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నారు. బుధవారం జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూను, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి సహకరించాలని శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అండదండలతో గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని, అందరి సహకారంతో గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లిసాల గ్రామ కూటమి నాయకులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments