నాతవరం జిల్లా వాణి ప్రతినిధి:మండలంలో చెర్లోపాలెం వైఎస్సార్ సీపీ సర్పంచ్ అభ్యర్థిగా పైల శిరీష బరిలో దిగారు.
దివంగత నేత స్వర్గీయ మాకి రెడ్డి వెంకటరమణ కుమార్తె అయిన శిరీష గత వైసిపి ప్రభుత్వం లో సర్పంచ్ గా అనేక అభివృద్ధి కార్యక్రమాలను తన తండ్రి రమణ ఆధ్వర్యంలో చేపట్టారు.నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ స్వర్గీయ రమణ కుల విభేదాలు లేకుండా అందరిలోనూ కలిసికట్టుగా మమేకమై మీ వెంట నేనున్నానంటూ భరోసాతో తన కుమార్తె శిరీషను అప్పట్లో బరిలోకి దించి ప్రజల ఆశీస్సులతో గెలుపొందారు.ఇటీవల సంవత్సర కాలం క్రిందట అనారోగ్య కారణంగా మృతి చెందిన సంగతి గ్రామస్తులకు విధితమే అయితే తండ్రి ఆశయ సాధనకు ప్రజలపై మమకారంతో శిరీష తన వంతు కృషి చేస్తూనే ఉంటుంది.మరల తండ్రి రమణ ఆశయాలకు అనుగుణంగా వైయస్సార్సీపి తరఫున పోటీ చేయాల ని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ప్రోత్సాహంతో పైల శిరీష ఈ దఫా సర్పంచ్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.తండ్రి రమణ ఆశీస్సులతోపాటు ప్రజల ఆదరణ చూపించి గెలిపించాలని పైల శిరీష కోరి ప్రార్థిస్తున్నారు
చెర్లోపాలెం వైఎస్ఆర్సిపి సర్పంచిగా పైల శిరీష
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
