మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం
రావులపాడు జిల్లా వాణి ప్రతినిధి
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రావులపాడు సర్పంచ్ పదవికి పోటీ రసవత్తరంగా మారుతోంది. ఓసీ జనరల్‌కు కేటాయించిన ఈ పదవికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మద్దతుతో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ తనకు కేటాయించిన మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తనతోపాటు 12 వార్డుల్లో పోటీ చేస్తున్న వార్డు సభ్యుల అభ్యర్థులను కూడా గెలిపించి పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
