HomeUmmadi Alluri Zillaక్యూలో.. నిలబడి గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే శిరీష దేవి దంపతులు

క్యూలో.. నిలబడి గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే శిరీష దేవి దంపతులు

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో గురువారం ఉదయం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక రంపచోడవరం నియోజకవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి ఆమె ఓటు హక్కును తన సొంత మండలం రాజవొమ్మంగి మండలం లోని కిండ్రా గ్రామ పంచాయతీలో తన భర్త రాజవొమ్మంగి జెడ్పీటీసీ మఠం విజయభాస్కర్ తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు కలిగిన పౌరులు కచ్చితంగా ఓటు హక్కు తూచా తప్పకుండా ఓటు వేయాలని ఎమ్మెల్యే శిరీష దేవి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అత్యంత విలువైనదని ఆమె అభివర్ణించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతాయుతంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments