HomeUmmadi Alluri Zillaఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సిద్ధం

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సిద్ధం

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి మేరకు నవంబర్ 30వ తేదీన పెన్షన్ నగదును ఉపసంహరించుకోవడంతో పాటు, నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో పెన్షన్ల పంపిణీ చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే ఉన్న అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయాలని, ప్రస్తుతం అమలులో ఉన్న పెన్షన్ మొత్తాల్లో ఎలాంటి మార్పులు చేయరాదని స్పష్టం చేశారు. పెన్షన్ నగదును ఉపసంహరించుకోవడానికి, తీసుకువెళ్లడానికి అధికారికంగా అనుమతి పొందిన వ్యక్తులు మాత్రమే అర్హులని, నగదు మొత్తం, పంపిణీ ఉద్దేశ్యం, సంబంధిత గ్రామం పేరును స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని, నగదు దుర్వినియోగం లేదా అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక పరిస్థితులు, ఎన్నికల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకొని సంబంధిత అధికారులు తగిన నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ మేరకు సంబంధిత ఎంపీడీవోలు, గ్రామ సచివాలయ సంక్షేమ కార్యదర్శులు, డీఆర్‌డీఏ అధికారులు, బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకొని పెన్షన్ల పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments