Thursday, April 16, 2026
HomeUncategorized*సూక్ష్మ కళాకారుడు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ గ్రహీత డా, గట్టెం వెంకటేష్ కు న్యూయార్క్...

*సూక్ష్మ కళాకారుడు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ గ్రహీత డా, గట్టెం వెంకటేష్ కు న్యూయార్క్ ప్రభుత్వం ప్రశంసలు*

నక్కపల్లి, జిల్లావాణి
సాంస్కృతిక ఆదరణను పెంపొందించే అన్ని నేపథ్యాల వ్యక్తులను స్వాగతించే సమ్మిళిత ప్రదేశాలను సృష్టించడంలో సూక్ష్మ కళాకారుడు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ గ్రహీత డా, గట్టెం వెంకటేష్ చేసిన కృషికి న్యూయార్క్ ప్రభుత్వం ప్రశంసలు అందించింది. ఈ మేరకు న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ క్యాథీ హోచుల్ సంతకంతో కూడిన ప్రశంస పత్రం,గుర్తింపు లభించిందని గట్టెం వెంకటేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ప్రశంసలు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని
13 సంవత్సరాలుగా, నేను ఈ మార్గానికి నన్ను నేను అంకితం చేసుకున్నానన్నారు.
నన్ను విశ్వసించి నాతో కలిసి నేర్చుకున్న, నాతో కలిసి కళను సృష్టించిన, మీ కథలను పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలన్నారు.ఈ పని నిరంతరం అభివృద్ధి చెందడానికి మీ సహకారం మరువలేనిదన్నారు.
కళాత్మక కృషికి ప్రశంసగా. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి సూక్ష్మరూపంతో ఎన్నో కళా ఖండాలను ఆవిష్కరణ చేసి అందరి మన్ననలు పొంది సృజనాత్మక ప్రపంచానికి నేను చేసిన సేవలకు గాను న్యూయార్క్ రాష్ట్రం నన్ను అభినందిస్తూ ప్రశంసలు అందజేయడం జీవితంలో మరువలేనిది అన్నారు.ఈ సందర్బంగా న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్
కేథీ హోచుల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు.

🙏🏾🙏🏾🙏🏾🙏🏾

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular