
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
మండలం లోని ఆర్ అండ్ ఆర్ కాలనిలో సుమారుగా రెండు లక్షల సామర్ధ్యంతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ ఆదివారం నిర్మాణ సమయంలో స్లాబ్ మొత్తం కూలిపోయి ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడ్డం బాధాకరమని వైసిపి రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. ఈ మేరకు సంఘటన జరిగిన తక్షణమే అక్కడకి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.అనంతరం వీసం రామకృష్ణ మాట్లాడుతూ భారీ ఎత్తున జరుగుచున్న వాటర్ ట్యాంక్ నిర్మాణం పట్ల అధికారులు వైపల్యం స్పష్టంగా కనిపిస్తుందని ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాల్సిన అవుసరం ఉందని నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా భద్రతా ప్రమాణాలు పాటించే విదంగా అవగాహన కల్పించాలని అలాగే ఈ ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన పాయకరావుపేట కు చెందిన సెంట్రింగ్ మేస్త్రి షేక్ అభి (38)
దొడ్డా ఆది శంకర్ సత్య నారాయణ (38) అనే ఇద్దరు కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు.
