పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తన నియోజకవర్గ పరిధిలోని మారుమూల వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లోనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా వెళ్లి పరిశీలించేందుకు శుక్రవారం ఉదయం రాజవొమ్మంగి మండలంలో పలుమారుమూల గ్రామాల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటి చైర్పర్సన్, రంపచోడవరం నియోజకవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి ఆమె పర్యటించారు. రాజవొమ్మంగి మండలం డి.మల్లవరం

గ్రామంలో వరదలకు ఇల్లు కూలిపోయిన సెగ్గి అర్జిబాబు కుటుంబ సభ్యులను శుక్రవారం ఆమె పరామర్శించారు. బాధితునికి నిత్యావసర సరుకులు,బియ్యం అందించారు. జరిగిన నష్టానికి అంచనా వేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అక్కడనుండి నేరుగా. రాజవమ్మంగి మండల కేంద్రంలోని సిహెచ్సి, జడ్డంగి గ్రామంలోని పీహెచ్సీలను ఎమ్మెల్యే శిరీష దేవి ఆకస్మికంగా సందర్శించి, ఆసుపత్రు ల్లోని ప్రతీ వార్డును ఆమె నేరుగా పరిశీలించారు. అనంతరం అక్కడున్న రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందుతుంది లేనిది వారిని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఆసుపత్రుల రికార్డుల ను పరిశీలించి, వైద్య సిబ్బంది సేవాభావం తో పనిచేయాలని సూచించారు. సిబ్బంది వైద్య సేవల విషయంలో అశ్రద్ధ వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఆమె హెచ్చరించారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్య సిబ్బందికి పలు చూసనలు, సలహాలు ఆమె తెలియ జేశారు. ఇదే క్రమంలో అమీనాబాద్ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను కూడా పరిశీలించారు. విద్యార్ధులకు ప్రభుత్వం నుండి అందించే అన్ని రాయితీలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఎమ్మెల్యే నేరుగా విద్యార్ధులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఎలాంటి అసౌకర్యం ఉన్న నేరుగా తనతో చెప్పాలని సూచించారు. ఇప్పటి వరకు పూర్తయిన సిలబస్ పై పాఠశాల యాజమాన్యంను ఆరా తీశారు. విద్యార్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నా రు. వసతి గృహంలోని వంట శాలను , నిత్యవరస సరుకులు భద్రప రిచే గదిని చూసి సరుకులు నాణ్యత పై అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం తూచా తప్పకుండా పౌష్టికాహారం అందించాలని ఆమె తెలిపారు. అనంతరం ఆమె విద్యార్థులతో కలసి భోజనం చేశారు. అలాగే సచివాలయం తనిఖీచేసిన ఆమె పలు సూచనలు చేశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించా రు. సిబ్బంది అందరూ సకాలంలో కార్యాలయాలకు హాజరు కావాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని సూచించారు. స్థానిక గ్రామానికి చెందిన కురుసల చంటి అనే వ్యక్తి ఇంటి గోడ తుఫాను కారణంగా కూలిపోవడంతో కుటుంబానికి తన వంతు ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాజవొ మ్మంగి తహసీల్దార్ స్వామి, వైద్యులు సుష్మ, పావని , రెవెన్యూ సిబ్బంది ఎస్. నాగేశ్వరరావు, భారతి, మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావు, మండల తెలుగు యువత అధ్యక్షులు బారంగి అనుదీప్, కొంగర సావిత్రి, ఊట చిన్నబాబు, గంగిరెడ్ల బుజ్జయ్య, .వెంకటరవు, తదితరులు పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో జడ్డంగి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చినబాబు పోలీస్ బందోబస్తు పర్యవేక్షించారు.
