
పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: ఏజెన్సీ అటవీ ప్రాంతాలలోని గత కొన్ని రోజులుగా అడవి రాజులుబాబు పండుగలు ఘనంగా జరుగుతున్నా యి. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం లోని పలు గ్రామాల్లో మంగళవారం జరిగిన పండుగలకు భారీగా ఆయా గ్రామాల ప్రజలు పండుగల వద్దకు వెళ్లి అన్న ప్రసాదాలను ఆరగించారు. ఈ క్రమంలోనే జడ్డంగీలో జరిగిన రాజులు బాబు పండుగకు రాజవోమ్మంగి మండల అల్లూరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సూరిబాబు మిత్ర బృందం మీడియా ప్రతినిధులు హాజరై అన్న ప్రసాదాలను స్వీకరించారు.
