HomeAndhra Pradeshగిరిజన ఉత్పత్తులకు జాతీయ స్థాయి మార్కెటింగ్ మద్దతు అందించి స్థిరమైన ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ముఖ్య...

గిరిజన ఉత్పత్తులకు జాతీయ స్థాయి మార్కెటింగ్ మద్దతు అందించి స్థిరమైన ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశ్యం: జిల్లా జాయింట్ కలెక్టర్

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లాలోని గిరిజన కళాకారుల ఉత్పత్తులను గుర్తించే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పోలవరం జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీకు బుధవారం గిరిజన కళాకారుల నమోదు మేళా ఉదయం 10 గంటలకు రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గిరిజన కళాకారులు మరియు వారి ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఉన్న ట్రైబస్ ఇండియా మరియు ట్రీఫెడ్ విక్రయ కేంద్రాల ద్వారా మార్కెటింగ్ చేయుటకు నమోదు చేయడం లక్ష్యంగా, ట్రీఫెడ్ ఆధ్వర్యంలో టీమ్ – ట్రైబల్ ఆర్టిసన్స్ రిజిస్ట్రేషన్ మేళా కార్యక్రమం 15 జూలై 2026 న రంపచోడవరంలో నిర్వహించబడుచు న్నదనీ ఆయన తెలిపారు. ఈ మేళా ద్వారా గిరిజన కళాకారులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు, సంప్రదాయ గిరిజన ఉత్పత్తులకు జాతీయ స్థాయి మార్కెటింగ్ మద్దతు అందించి స్థిరమైన ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశ్యం. ఆసక్తి గల గిరిజన కళాకారులు తమ ఉత్పత్తులతో పాటు క్రింది పత్రాల జిరాక్స్ ప్రతులను తీసుకుని మేళాకు హాజరు కావలసిందిగా కోరడమైనది. 1.గిరిజన కుల ధృవీకరణ పత్రం 2.ఆధార్ కార్డు 3.బ్యాంక్ పాస్‌బుక్ 4.పాస్‌పోర్ట్ సైజు ఫోటో మేళాలో ఎంపికైన కళాకారులు మరియు వారి ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఉన్న ట్రైబస్ ఇండియా విక్రయ కేంద్రాల ద్వారా మార్కెటింగ్ చేయుటకు నమోదు చేయడం జరుగుతుందని ఆయనతెలిపారు. ప్రయాణ భత్యం (టీ ఏ) నిబంధనల ప్రకారం చెల్లించబడుతుందని ఆయన అన్నారు.గిరిజన కళాకారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సంప్రదా య ఉత్పత్తులను జాతీయ స్థాయిలో ప్రదర్శించి ప్రోత్సహించ వలసిందిగా కోరడమైనదనీ ఆయన అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ ట్రీఫెడ్ చైర్మన్, పోలవరం జిల్లా కలెక్టర్ వారు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular