HomeAndhra Pradeshతమ నాయకుడు త్వరగా కోలుకోవాలని భద్రాచలంలో ప్రత్యేక పూజలు

తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని భద్రాచలంలో ప్రత్యేక పూజలు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు ముంబైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్య పొందుతున్న సంగతి తెలిసిందే.! పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరు. ఈనేపథ్యంలో పోలవరం జిల్లా రంపచోడవరం నియోజవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉప ముఖ్యమంత్రి పవన్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ఎటపాక జనసేన పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాల కోసం శ్రీ సీతారాములవారిని ప్రార్థించారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎటపాక జనసేన పార్టీ నాయకులు మారసు గంగాధర్, బొడ్డు ఆనంద్, కొమ్ము వెంకటేష్, గోవింద్ వెంకట్, ఓబినేని శివకృష్ణ, తంత్రపల్లి సత్యనారాయణ, మందా సాయి, గడ్డల ప్రవీణ్, మందా రాజేష్ కార్యకర్తలు, అభిమానులు మరియు పలువురు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular