HomeAndhra Pradeshఎమ్మెల్యే , కలెక్టర్ ప్రత్యేక చొరవతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో నూతన బోర్లు ఏర్పాటు

ఎమ్మెల్యే , కలెక్టర్ ప్రత్యేక చొరవతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో నూతన బోర్లు ఏర్పాటు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం డివిజన్
రాజవొమ్మంగి మండలంలో మారేడుబాక గ్రామ పంచాయతీ పరిధిలోని ఉర్లాకులపాడు శివారు జి.శరభవరం, మేలినవారివీధి గ్రామాలకు జలజీవన్ మిషన్ పథకంలో మంచినీటి ట్యాంక్ లు మంజూరై నిర్మాణాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఆ గ్రాంట్ లో బోర్లు నిర్మించుకోవడానికి నిధులు సరిపోకపోవడంతో బోర్లు ఏర్పాటు చేయలేదు. ఈక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు శిరీష దేవి సమక్షంలో విషయాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ రెండు ట్యాంక్ లకు బోర్లు ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో నూతన బోర్లు గురువారం స్థానిక మాజీ జడ్పీటీసీ కోసూరి బుజ్జి చిన్నాలమ్మ సమక్షంలో బోర్లు నిర్మించదామైనది. బోర్లు ఏర్పాటు చేయడం వల్ల ఆయ రెండు గ్రామాలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా త్రాగునీరు సరఫరా అవుతుందని బుజ్జీ చిన్నాలమ్మ వాపోయారు.
బోర్లు ఏర్పాటుకు సహకరించిన అర్.డబ్ల్యు.ఎస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యే శిరీష దేవికి, కలెక్టర్ దినేష్ కుమార్ కు ఆయా ప్రాంతాల్లోనీ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకురాలు,మాజీ జడ్పీటీసీ కోసూరి బుజ్జిచిన్నాలమ్మ , మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావ్,మారేడుబాక పంచాయతీ కార్యదర్శి పొత్తూరి లక్ష్మణ్, మేలిన చిన్నబ్బాయి, కోసూరి లోవరాజు జి.శరభవరం, మేలినవారివీధి గ్రామస్థులు తదితరులకు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular