HomeAndhra Pradeshదివంగత తెదేపా సీనియర్ నేత కిముడు లక్ష్మయ్యకు ఘన నివాళులు

దివంగత తెదేపా సీనియర్ నేత కిముడు లక్ష్మయ్యకు ఘన నివాళులు

చింతపల్లి, జిల్లావాణి ప్రతినిధి: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని చింతపల్లి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ కిముడు లక్ష్మయ్య ఇటివలే అకాల మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలో ఆయన పార్టీకి చేసిన సేవలను స్మరించుకుంటూ స్మరించుకుంటూ చింతపల్లి మండల తెలుగుదేశం పార్టీ చింతపల్లి మండల అధ్యక్షులు పూర్ణచందు మరియు పార్టీ ముఖ్య నాయకులు సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సమావేశమై కొద్ది నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ లక్ష్మయ్య పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని పలువురు వాపోయారు. అంతేకాకుండా పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. కిముడు లక్ష్మయ్య చింతపల్లి మండలంలో టీడీపీ పునాదులను బలోపేతం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular