HomeUncategorizedరాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాపాడాలి నేతల నాగేశ్వరరావు

రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాపాడాలి నేతల నాగేశ్వరరావు

జిల్లా వాణి ప్రతినిధి గొలుగొండ నవంబర్ 27 భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ, రాజ్యాంగం కల్పించిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పాటించాలని సామాజిక కార్యకర్త నేతల నాగేశ్వరరావు పిలుపునిచ్చారుభారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం, సామాజిక న్యాయం కల్పించే మహత్తర పత్రం అని పేర్కొన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి ఎంతో కీలకమని తెలిపారు.రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను పరిరక్షించడంతో పాటు, రాజ్యాంగబద్ధమైన విధులను బాధ్యతగా నిర్వర్తించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు. కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు తావులేకుండా సమానత్వం, సామాజిక న్యాయం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని నేతల నాగేశ్వరరావు ఆకాంక్షించారు.నేతల నాగేశ్వరరావు
సామాజిక కార్యకర్త
నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ …

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments