HomeUncategorized*దస్తావేజు లేఖరులతో పాటు ప్రజలు ఇబ్బంది పడే ప్రభుత్వ నిర్ణయాలు సరికాదు*

*దస్తావేజు లేఖరులతో పాటు ప్రజలు ఇబ్బంది పడే ప్రభుత్వ నిర్ణయాలు సరికాదు*

నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి :

రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విషయం లో ప్రభుత్వం జీవో నంబర్ 396 ను తీసుకోని వచ్చి ఇటు దస్తావేజు లేఖరులకు, అటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేయడం తగదని దీనితో రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు.జీవో నెంబర్ 396 కు వ్యతిరేకంగా చేస్తున్న దస్తావేజు లేఖరుల పెన్డౌన్ సమ్మె మూడవ రోజు కొనసాగింది. పెన్ డౌన్ సమ్మెకు సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, సిపిఎం మండల కార్యదర్శి రాజేష్ లు బుధవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న సభ్యులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వెనక్కి తీసుకోవాలని లేని పక్షం లో దీనివల్ల దస్తావేజు లేఖర్లతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. తక్షణం జీవో నెంబర్ 396 ని రద్దు చేయాలని ద్వారా నష్టపోయిన లేఖర్లు వృత్తిని కాపాడాలని ప్రజలకు కూడా ఇబ్బందులు తప్పుతాయని ప్రభుత్వాన్ని కోరారు. తమ వృత్తి భద్రతను కాపాడాలి అంటూ దస్తావేజు లేఖర్ల సభ్యులు నిరసన తెలియజేశారు. జీవో నెంబర్ 396 రద్దు చేయాలని , పి పి పి విధానాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరగడం వలన తమ వృత్తిని కోల్పోయి వీధిని పడే అవకాశం ఉందని , తక్షణం రద్దు చేసి లేఖర్ల జీవనోపాధిని కాపాడాలని వారు కోరారు. తమ విధులను బహిష్కరించి పెన్డౌన్ చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు కొంగరచిన కృష్ణమూర్తి, అధ్యక్షుడు దాతారం మురళీకృష్ణ, కార్యదర్శి బత్తుల శ్రీను, ఉపాధ్యక్షుడు ఎన్ వి రమణ, ట్రెజరర్ లోవరత్నం, సహాయ కార్యదర్శి డిఎంపి కుమార్, రాంబాబు, సూర్యనారాయణ, బొంతు రాజు, రమేషు ,గోవిందు, వరహాలు, శేఖర్, నూకరాజు, త్రినాధ్, ముద్ద బాబ్జి, నవీన్ ,హేమంత్, లక్ష్మి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular