
*కలెక్టర్ విజయ్ కృష్ణణ్ ను కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందించిన కాగిత గ్రామ రైతులు*
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
మండలం లోని కాగిత గ్రామ రైతులు వైసిపి రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణణ్ ను కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ రైతులు ఎన్నో ఏళ్లుగా పంట పొలాలకు రాక పోకలు సాగిస్తున్నామని కాగిత గ్రామం నుండి మా పంట పొలాలతో పాటు ఎన్. నర్సాపురం గ్రామానికి వెళ్లేందుకు ఎన్ఆర్ఈజిఎస్ లో గతంలోనే రోడ్డు నిర్మాణం చేసారని కాగిత గ్రామం తో పాటు ఎన్. నరసాపురం గ్రామ రెవిన్యూ పరిధిలో సుమారుగా 400 ఎకరాల పంట పొలాలుకు వెళ్లేందుకు ఈ రహదారి రైతులందరికి ఎంతగానో ఉపయోగపతుందని ఇటువంటి తరుణం లో ఏపీఐఐసి రోడ్డు నిర్మాణం లో భాగంగా దారి మార్గం (డివైడర్) ను 400 మీటర్లు దూరం లో ఏర్పాటు చేస్తున్నారని ఇలా ఏర్పాటు చేసిన దారి మార్గం లో రైతులు రోడ్డు దాటే సమయంలో ఇరు వైపుల రోడ్డులో సరైన మార్గం లో కాకుండా విరుద్ధంగా వెళ్లాల్సి వస్తుందని దీనివల్ల పంట పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంతేకాకుండ పంట పొలాలు నుండి వ్యవసాయ దినుసులు తరలించడానికి కూడ వ్యయప్రయాసలు పడుతున్నామని తెలిపారు.అలాగే జాతీయ రహదారి నుండి పిసీపీఐఆర్ ఏర్పాటు చేస్తున్న 2వ పాయింట్ కూడా (ఎర్ర చెరువు కు వెళ్లే మార్గం) ప్రస్తుతం ఉన్న గ్రావెల్ రోడ్డు వద్ద కాకుండా వేరేక ప్రదేశం లో ఏర్పాటు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో రైతులు, దేవవరవు శివ, పోతం శెట్టి బాబ్జి, గుమ్మెళ్ళ గోవిందరావు, గుమ్మేళ్ల జెమిలు, పోతం శెట్టి వీరబాబు, గోవిందు, దేవవరపు గోవిందరావు, సత్య నారాయణ, పోతం శెట్టి గణేష్, సకుర్తి సత్తిబాబు, పోతం శెట్టి గంగేశ్వరావు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.
