HomeUncategorizedనర్సీపట్నంలో మహిళల భద్రత పై అవగాహన కార్యక్రమం.

నర్సీపట్నంలో మహిళల భద్రత పై అవగాహన కార్యక్రమం.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ చేపట్టిన“అభయ – మీ భద్రత… మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం టౌన్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నోబుల్ నర్సింగ్ కాలేజీలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. ఉమా మహేశ్వరరావు పాల్గొని విద్యార్థినులకు మహిళల భద్రత, చట్టపరమైన రక్షణ, అత్యవసర సహాయ సేవలు, సైబర్ నేరాల నివారణ, మహిళలు–బాలికలపై వేధింపులను అరికట్టే మార్గాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాలని సూచించారు.మహిళలు, బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళా హెల్ప్‌లైన్ 181, సైబర్ నేరాల కోసం 1930 సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.అదేవిధంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, సామాజిక దుష్పరిణామాలను వివరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు.సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular