
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
ఎదిగేకొలది ఒదిగి ఉండే గొప్ప మనస్తత్వం మెగాస్టార్ కు సొంతం. సినిమా రంగం లో స్వయంకృషితో ప్రత్యేక స్థానం సంపాదించి తనకంటూ ఎవ్వరు ఊహించని ఎత్తుకు ఎదిగి ప్రపంచ స్థాయిలో భారీ ఎత్తున అభిమానుల గుండెల్లో మెగాస్టార్ గా ఎప్పటికి గుర్తుండిపోయే నటుడుగా, అనేక సేవా కార్యక్రమాలతో పేదల పాలిట ఆపద్భాందడువుగా మంచి మనసున్న మనిషిగా, మచ్చలేని రాజకీయ నాయకుడుగా,కోట్లాది మంది అభిమానులును సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు అభిమానులు రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా చిరంజీవి యువత అధ్యక్షులు కొల్నాటి దుర్గా ప్రసాద్, ఉత్తరాంధ్ర కార్యవర్గ సభ్యులు మీగడ సత్యనారాయణ మూర్తి, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి లంక శ్రీనివాసరావు, కెవి. సత్య నారాయణ,ఆధ్వర్యంలో ప్రతి రోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మెగా అభిమానులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, అట్టలు, పెన్నలు తదితర వస్తువులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా మెగాస్టార్ అభిమానులు చేస్తున్న ప్రత్యేక సేవా కార్యక్రమాలు పట్ల పలువురు నాయకులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమం లో పోలినాటి నానాజీ, పెదిరెడ్డి రమేష్, అడ్డూరి లోవరాజు,సుధా, ప్రమోద్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు..
