HomeAndhra Pradeshఐటీడీఏ గ్రీవెన్స్ లో సమస్యలు పరిష్కారం కోరుతూ వినతులు విలువ

ఐటీడీఏ గ్రీవెన్స్ లో సమస్యలు పరిష్కారం కోరుతూ వినతులు విలువ

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలోని మారుమూల గ్రామాలకు సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కారం దరఖాస్తులు స్వీకరించి కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించి మరికొన్ని సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కార మార్గాలు అన్వేషించి సమస్యలు పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐటిడిఏ సమావేశపు హాలులో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)&( రెవెన్యూ క్లినిక్) పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్,పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్, రంపచోడవరం ఆర్డీవో కె.స్వాతి నిర్వహించారు.ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ వారం గ్రీవెన్స్ 185 క దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ కి 35 దరఖాస్తులు రావడం జరిగిందని ఆయన తెలిపారు. పాపికొండలు నేషనల్ పార్కు సమీపంలోని పేరంటాలపల్లి కొల్లూరు గ్రామంలోని టూరిస్టులకు ఆహార పదార్థాలు కల్పించే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పివీటీజీ గిరిజనులకు ఫుడ్ క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని వేట్ల కృష్ణ కుమార్ రెడ్డి, వేట్ల రామ్ కుమార్ రెడ్డి,కదల భాస్కర్ రెడ్డి దరఖాస్తు సమర్పించారు.

పోలవరం ప్రాజెక్టుకు ముంపునకు గురైన తాడివాడ, కుక్కేరగూడెం, నడిపూడి, తెలిపేరు, సోమర్లపాడు, కొత్తగూడెం, పెద్దగూడెం, కత్తనపల్లి, మెట్టగూడెం,కొండ మొదలు గ్రామాలకు ఏర్పాటుచేసిన నేలదోనెలపాడు గ్రామానికి కొత్త కొండమొదలు నామకరణంతో పంచాయితీ ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ వేట్ల విజయ,వంజన్ జోగారావు,వేట్ల సత్యనారాయణ దరఖాస్తు సమర్పించారు.

రంపచోడవరం మండలం ఊట్ల గ్రామంలోని 50 మంది బాల బాలికలకు సంబంధించిన అంగన్వాడి కేంద్రానికి కొత్త అంగన్వాడి భవనం ఏర్పాటు చేయాలని వెదురుపల్లి వెంకటేశ్వర్లు,తుర్రం లక్ష్మి,కారం కొండబాబు,మడకం బాపన్న దొర దరఖాస్తు సమర్పించారు. దేవీ పట్టణ మండలం మూలపాడు గ్రామానికి చెందిన 11 మంది రైతులకు 25 ఎకరాలకు డి పట్టాలు మంజూరు చేయాలని తురస లక్ష్మి,కొమరం వెంకటలక్ష్మి,తుర్రం పండమ్మ దరఖాస్తు సమర్పించారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన దండంగి ఆర్ అండ్ ఆర్ కాలనీలో పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, పాఠశాలకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని మిర్తివాడ వీరబాబు, మిత్తివాడ సూరారెడ్డి,సోము బాపన్న దొర దరఖాస్తు సమర్పించారు. భూపతిపాలెం ప్రాజెక్ట్ రంపచోడవరం మండలం, గంగవరం మండలం రైతులకు భూపతిపాలెం ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఏర్పాటు చేయాలని లోత రామారావు,కిరణ్, మట్ల వాణిశ్రీ ఆధ్వర్యంలో రెండు మండలాలకు సంబంధించిన గిరిజన రైతులు జిల్లా కలెక్టర్ వారికి దరఖాస్తులు సమర్పించారు. రంపచోడవరం మండలం రంపచోడవరం గ్రామం లో అంబేద్కర్ సెంటర్ సమీపంలో ఉన్న ప్రభుత్వ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వున్నా ప్రధానగేటుకు ముందు అనాధికార టిఫిన్ సెంటర్లలను తొలగించాలని స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కె. ఏం.వి. ప్రసాద్ దరఖాస్తు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఏపీవోలు జనరల్ డిఎన్వి రమణ,గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య,డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్.దాసరి రత్నాకరరావు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహన్,జిల్లా విద్యాశాఖ అధికారి జి.శ్రీరామ్ మూర్తి , వై.మల్లేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దేవదానం, సబ్ డి ఎఫ్ ఓ అనుష,పీహెచ్ఓ నరేంద్ర కుమార్,జిల్లా మత్స్యశాఖ అధికారి దిల్షాద్, డిడిఓ వెంకటనారాయణ, ఐసిడిఎస్ జిల్లా అధికారి కే.ఉమా,జిల్లా మలేరియా అధికారి భాస్కర రావు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఐ.శ్రీనివాసరావు, అచ్యుతారావు, రవికుమార్, రాఘవరావు,పి డి డ్వామా రామ్ ప్రసాద్,డిసిహెచ్ఎస్ సాంబశివరావు,పిఏఓ ఎల్.రాంబాబు, డిప్యూటీ తహసిల్దార్లు శ్రీధర్, రవీంద్రబాబు,శివ, శ్రీరామచంద్రమూర్తి,డిఈలు పి. వెంకటరమణ, చైతన్య, శివ, సుబ్బారావు, డిఎన్జీసిసి జయశ్రీ, డిఎం సివిల్ సప్లై రాజేశ్వరి, అసిస్టెంట్ ఎక్స్చేంజ్ సూపర్డెంట్ సుబ్రహ్మణ్యం, ఏడిఏ సావిత్రి,ఆర్టీవో రాజేష్ కుమార్,సబ్ రిజిస్టర్ ఉపేంద్ర,ఎస్ ఓ రోలుపల్లి భాస్కర రావు,ఐటీడీఏ ఏవో ఎర్రంశెట్టి రాజు, ఎల్డిఎం జి. బుజ్జిబాబు,సిడిపిఓలు క్రాంతి కుమరి, ప్రత్యూష,డిప్యూటీ ఏపీ ఈపీడీసీఎల్ ఇంజనీర్ సాలెం రాజ్,డిపిఎం జి. నాగభూషణరావు, జిసిసి డిఎం జయ శ్రీ,తాసిల్దారులు, అమ్మాజీ, సరిత,సిహెచ్ శ్రీనివాసరావు,శివ,కరక సత్యనారాయణ, తేజస్విని, స్వామి,ఎంపీడీవోలు ప్రసాద్, శ్రీనివాసరావు, బాపన్న దొర, కుమార్, యాదగిరిశ్వరరావు డీటీలు రవీంద్రబాబు, సునీత,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular