పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలోని పిజిఆర్ఎస్ కు వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటిడిఏ సమావేశపు హాల్లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో పి జి ఆర్ ఎస్ (గ్రీవెన్స్) కు వచ్చిన సమస్యల దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, రంపచోడవరం రెవిన్యూ డివిజనల్ అధికారి కె.స్వాతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలోని మారుమూల

గ్రామాలకు సంబంధించిన ప్రజల సమస్యల దరఖాస్తులు పరిష్కరించే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత దరఖాస్తు దారినితో ఫోన్లో సంప్రదించి సమస్యలు పరిష్కరించే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వారి కార్యాలయం నుండి ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా దరఖాస్తుదారునికి ఫోన్లు రావడం జరుగుతుందని అదేవిధంగా ఐ వి ఆర్ ఎస్ కాల్ రాకముందే సంబంధిత దరఖాస్తుదారినీతో ఫోన్లో మాట్లాడి నిబంధనల ప్రకారం సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. ప్రతి దరఖాస్తుకు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం సమస్యలు పరిష్కారం కొరకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. పీజీ ఆర్ఎస్కు వచ్చిన సమస్యల దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పి జి ఆర్ ఎస్ కు వచ్చిన దరఖాస్తులు ముఖ్యమంత్రి వారి కార్యాలయం నుండి, జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పీజీ ఆర్ఎస్ కు వచ్చిన దరఖాస్తులన్నీ ఎప్పటికప్పుడు వార వారం ఆడిట్ జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి దరఖాస్తుకు ప్రభుత్వ నిబంధన ప్రకారం దరఖాస్తుదారుని అర్హతను బట్టి ఒకటికి రెండుసార్లు పరిశీలించి దరఖాస్తులు పరిష్కరించాలని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలోని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ప్రభుత్వ శాఖలలో ఎన్ని పీజిఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నవి మండలాల వారిగా ఆయన ఆరా తీశారు.పి జి ఆర్ ఎస్ కు వచ్చిన దరఖాస్తులను సమస్యల పరిష్కారం కొరకు యాక్షన్ టేకెన్ రిపోర్టులు సమర్పించాలని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కాలనీలలో సోలార్ సిస్టం నూటికి నూరు శాతం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పోలవరం జిల్లాలోని మంజూరైన వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈనెల 29వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు గ్రామంలో సంజీవిని ప్రోగ్రాం ప్రారంభోత్సవంనకు వచ్చుచున్నారని పోలవరం జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సిబ్బంది వివిధ రకాలైన అభివృద్ధి పనులకు సంబంధించిన రిపోర్టులు సిద్ధం చేయాలని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోలవరం జిల్లాలోని మంజూరైన గృహాలు వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏపీవోలు జనరల్ డిఎన్వి రమణ,గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య,డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్.దాసరి రత్నాకరరావు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహన్,జిల్లా విద్యాశాఖ అధికారి జి.శ్రీరామ్ మూర్తి , వై.మల్లేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దేవదానం, సబ్ డి ఎఫ్ ఓ అనుష,పీహెచ్ఓ నరేంద్ర కుమార్,జిల్లా మత్స్యశాఖ అధికారి దిల్షాద్, డిడిఓ వెంకటనారాయణ, డ్రామా పిడి రాంప్రసాద్ ఐసిడిఎస్ జిల్లా అధికారి కే.ఉమా,జిల్లా మలేరియా అధికారి భాస్కర రావు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఐ.శ్రీనివాసరావు, అచ్యుతారావు, రవికుమార్, రాఘవరావు,డిసిహెచ్ఎస్ సాంబశివరావు,పిఏఓ ఎల్.రాంబాబు, డిప్యూటీ తహసిల్దార్లు శ్రీధర్, రవీంద్రబాబు,శివ, శ్రీరామచంద్రమూర్తి,డిఈలు పి. వెంకటరమణ, చైతన్య,శివ,సుబ్బారావు, డిఎన్జీసిసి జయశ్రీ, డిఎం సివిల్ సప్లై రాజేశ్వరి, అసిస్టెంట్ ఎక్స్చేంజ్ సూపర్డెంట్ సుబ్రహ్మణ్యం, ఏడిఏ సావిత్రి,ఆర్టీవో రాజేష్ కుమార్,సబ్ రిజిస్టర్ ఉపేంద్ర,ఎస్ ఓ రోలుపల్లి భాస్కర రావు,ఐటీడీఏ ఏవో ఎర్రంశెట్టి రాజు, ఎల్డిఎం జి. బుజ్జిబాబు,సిడిపిఓలు క్రాంతి కుమరి, ప్రత్యూష,డిప్యూటీ ఏపీ ఈపీడీసీఎల్ ఇంజనీర్ సాలెం రాజ్, అచ్యుతరావు, శ్రీనివాసరావు,డిపిఎం జి. నాగభూషణరావు,జిసిసి డిఎం జయ శ్రీ,తాసిల్దారులు, అమ్మాజీ, సరిత,సిహెచ్ శ్రీనివాసరావు,శివ,కరక సత్యనారాయణ, తేజస్విని, స్వామి,ఎంపీడీవోలు ప్రసాద్, శ్రీనివాసరావు, బాపన్న దొర, కుమార్, యాదగిరిశ్వరరావు,డీటీలు రవీంద్రబాబు, సునీత,తదితరులు పాల్గొన్నారు.
