HomeUncategorizedశెట్టిపాలెంలో నూతన రామాలయానికి భూమి పూజ.

శెట్టిపాలెంలో నూతన రామాలయానికి భూమి పూజ.

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామంలో నూతన రామాలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ పెద్దల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది.నూతన రామాలయ నిర్మాణానికి సుమారు రూ.కోటి వ్యయంతో పనులు ప్రారంభించేందుకు గ్రామ పెద్దలు సహకారం అందించారు. భూమిపూజ సందర్భంగా పలువురు దంపతులు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరాముడి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు అల్లు స్వామినాయుడు, ఈశ్వరరావుతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు. గ్రామంలో నూతన రామాలయం నిర్మాణం ప్రారంభం కావడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular