HomeUncategorized*ఆరో రోజుకి చేరిన వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల శాంతి యుత నిరసన*

*ఆరో రోజుకి చేరిన వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల శాంతి యుత నిరసన*

*ఆరో రోజుకి చేరిన వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల శాంతి యుత నిరసన*
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
వైద్య ఆరోగ్య శాఖ లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు పలు సమస్యలు పై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చేస్తున్న శాంతి యుత నిరసన ఆరో రోజు కు చేరింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్, హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ అసోసియేషన్ కమిటీ అనకాపల్లి జిల్లా ఆధ్వర్యంలో చేస్తున్న ఈ శాంతి యుత నిరసన ఈ నెల 21 నుండి దశల వారీగా కార్యాచరణ చేపట్టారు. ఉద్యోగులను క్రమబద్దీకరించాలని,ప్రభుత్వం నుండి లభించే ప్రయోజనాలు అందరికి వర్తింప జేయాలనీ ఉద్యోగ భద్రత, సంక్షేమం కల్పించి న్యాయం చేయాలనీ కోరారు. ఇప్పటికే ఈ సమస్యలు పై హోం మంత్రి వంగలపూడి అనితకు వినతి పత్రం అందజేశామని వచ్చే నెల 2 న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాయకరావుపేట పర్యటన కు వస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పై ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకోని వెళ్లేలా హోం మంత్రి అనితను కోరినట్టు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ సౌమ్య, ఎస్. ఇమామ్, ఎస్. శివ ప్రసాద్ వర్మ, ఇ. జీవన జ్యోతి, జి. వనజ, ఆర్. వరలక్ష్మి, ఎస్. ఉమా దేవి, కె. భవాని, కె. రాము తల్లి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular