HomeUncategorizedజేపీ అగ్రహారంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.

జేపీ అగ్రహారంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జెపి అగ్రహారం పంచాయతీ పరిధిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముక్తి గురువుల శిష్యులు శ్రీ చంద్రశేఖర్ దాసాజీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా, గ్రామ ప్రజలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీ చంద్రశేఖర్ దాసాజీ భక్తులకు దీక్ష, ఆధ్యాత్మిక జ్ఞానం, ముక్తికి సంబంధించిన విషయాలను సంక్షిప్తంగా వివరించి బోధనలు చేశారు. శ్రీకృష్ణుని తత్వం, ఆధ్యాత్మిక మార్గంలో మానవ జీవితానికి సంబంధించిన సందేశాలను భక్తులకు తెలియజేశారు.అనంతరం భక్తులు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, గ్రామ పెద్దలు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular