HomeAndhra Pradeshపింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏటువంటి తారతమ్యం లేకుండా సక్రమంగా జరుగుతుంది: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల...

పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏటువంటి తారతమ్యం లేకుండా సక్రమంగా జరుగుతుంది: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకా అర్హులైన లబ్ధిదారులు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించడంలో ఏటువంటి తారతమ్యం లేకుండా ప్రజలా వద్దకే నేరుగా అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు అన్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఒకటో తారీకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ పింఛన్ లబ్దిదారులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫింఛన్లు పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి నెల జరుగుతుందని పెద్దిరాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీ లేదా సేవలు ఉంటే ఒక రోజు ముందుగానే పింఛన్దారులకు ప్రతిష్టాత్మకంగా పింఛన్ డబ్బులు అందజేస్తూ పండగ వాతావరణం తలపించేలా నిర్వహిస్తున్నారు అన్నారు. అంతేకాకుండా కూటమి చెందిన టీడీపీ జనసేన మరియు బీజేపీ ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ, ఒకటో తారీకు తెల్లవారుజామున పెన్షన్ దారులు అందరికి నగదు అందేలా చూడటం కూటమి శ్రేణుల బాధ్యత అని ఆయన తెలిపారు. ఇలా మధ్యకు ఎప్పటికప్పుడు వెళ్లడం వల్ల ప్రజా సమస్యలను కూడా గుర్తించి వాటిని పరిష్కరించడంలో ప్రజా పతినిధులు భాగస్వాములు అవుతారని పెద్దిరాజు స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో చెక్కా లోవరాజు, టి నూకరాజు, బి చంద్రరావు సచివాలయం సిబ్బంది, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular