పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలో రెండు విడతలుగా నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు, వారు ఓటరుగా నమోదైన సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నవంబర్ 26వ తేదీన మొదటి విడతలో పోలింగ్ నిర్వహించే ప్రాంతాల్లో ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది నవంబర్ 23వ తేదీన తమ ఓటు నమోదై ఉన్న మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసే పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు వేయవచ్చని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా నవంబర్ 29వ తేదీన రెండో విడత పోలింగ్ విధుల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బంది నవంబర్ 27వ తేదీన సంబంధిత మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసే పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలనుకునే ఎన్నికల సిబ్బంది సంబంధిత మండల పరిధిలోని ఓటర్ల జాబితాలో తమ పేరు తప్పనిసరిగా నమోదై ఉండాలని కలెక్టర్ సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే సిబ్బంది తమ పోలింగ్ డ్యూటీ కేటాయింపు ఉత్తర్వులు ఓటరు గుర్తింపు కార్డు ఉద్యోగ గుర్తింపు కార్డు లేదా ప్రభుత్వం నిర్దేశించిన ఇతర ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం అర్హులైన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ నియమావళి ప్రకారం అర్హులైన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో నియమితులైన ప్రతి సిబ్బంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ఈ సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని, సంబంధిత సిబ్బంది నిర్దేశించిన తేదీల్లో తమ మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి అవసరమైన గుర్తింపు పత్రాలతో హాజరై పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం: జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె దినేష్ కుమార్
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
