పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండల తాసిల్దార్ గా ఇప్పటి వరకు పనిచేసిన అల్లు సత్యనారాయణ సేవలు ఎనలేనివని ఆదివాసీ వాల్మీకి సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం ఉదయం పదోన్నతిపై రాజవొమ్మంగి మండలం నుంచి పోలవరం జిల్లా ప్రధాన కేంద్రంలోని రంపచోడవరం డివిజనల్ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిఏఓ వెలుతున్న అల్లు సత్యనారాయణను వాల్మీకి సంఘం నాయకులు కలిసి ఘనంగా పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తహసిల్దార్ సత్యనారాయణ మండల ప్రజలకు రెవెన్యూ పరమైన సేవలు అందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
