HomeUncategorizedమున్సిపల్ వర్కర్స్ ఎలమంచిలి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు

మున్సిపల్ వర్కర్స్ ఎలమంచిలి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు

+రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు అందర్నీ పర్మిట్ చేయాలని రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ (aituc) పిలుపుమేరకు శనివారం స్థానిక ఎలమంచిలి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్( aituc) ప్రధాన కార్యదర్శి గనిశెట్టి ఏసుదాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను వివిధ కాంట్రాక్టర్లకు అప్పజెప్పాలని చూస్తుందని అది విరమించుకోవాలని కార్మికులు వేతనాలు పెంచి రెగ్యులర్ చేయాలని 60 సంవత్సరాల నిండిన’ మరియు మరణించిన వారు స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని తదితర సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర మున్సిపల్ ఫెడరేషన్ ఈనెల 20 నుంచి వచ్చి నెల ఏడో తారీఖు వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే కార్మికులు యూనియన్ లఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఏసుదాస్ అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వై నూకరాజు సిహెచ్. వెంకటరమణ డి.మహేష్ జి. వెంకటరమణ ఎం. నాగరాజు పి.సూరిబాబు వీ.కన్నాజీ వై. దుర్గారావు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular