


పోలవరం జిల్లావాణి ప్రతినిధి: గోదావరి నదిలో చేపల వేటకి వెళ్లి మృతిచెందిన కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటి చైర్ పర్సన్ రంపచోడవరం నియోజవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీషాదేవి పరామర్శించారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఎటపాక మండలం గొమ్ము కొత్తగూడెంలో శనివారం చేపల వేటకు వెళ్లి మృత్యోవాతపడడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నా యి. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన 10 మంది గ్రామస్థులు 2 మగవారు, 8 మంది మహిళలు గొల్లగూడెం గ్రామం సమీపంలో గోదావరి నదిలో చేపలవేటకు వెళ్లారు. దోమతెరలతో చేపలవేటకు వెళ్ళినట్లు గ్రామస్తులు తెలిపారు. చేపల వేట సాగుతున్న సమయంలో 5 గురు గోదావరి నదిలో మునిగి పోయారని గ్రామస్తులు పేర్కొన్నారు. మృతిచెందిన వారిలో ఇప్పటివరకు ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలను గుర్తించారన్నారు. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే శిరీష దేవి హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను మండల పార్టీ అధ్యక్షులు బొల్లా పుల్లయ్యతో కలిసి కుటుంబ సభ్యులను పమర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ ఘటనపై ఆమె తీవ్ర దిబ్బంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి వివరాలు గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు (1) ఉకే లక్ష్మి W/O: వెంకటేష్ 37, (2) ఉకే సుశీల, W/O: రాంబాబు 37, (3) బసిబోయిన బాలరాజు, తండ్రి: ముత్తయ్య 40, (4). తుర్రం భారతి, భర్త: శ్రీను 40, (5)ఉకే రమేష్, తండ్రి: వీరయ్య 37 మృతిచెందారు. కాగా ఆయా మృతదేహాలను చూసిన ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యాంతమయ్యారు. ఒక్కసారిగా చలించిన ఆమె ఒకే కుటుంబంలో ఇలా జరగటం చాలా దురదృష్టం అని సంతాపం వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాల్ని ఆదుకుంటామని ప్రభుత్వం దృష్టిలో పెడతామని భరోసా ఇచ్చారు. మృతదేహాలకు పంచనామా పోస్ట్ మార్టం త్వరగా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసు, వైద్య సిబ్బందికి సూచించారు. మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులు రీత్యా కూడా ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు చేయడం మంచిది కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పై పోలీసు అధికారులు ప్రజలకు చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆమె వెంట ఎటపాక టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు బొల్లా పుల్లయ్య, క్లస్టర్ ఇంచార్జీ వల్లభనేని చందు, మండల ప్రధాన కార్యదర్శి కనితిమధు, వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు, మువ్వా శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ మాచినేని రాజేష్ , ఎంపీటీసీ పాయం దేవి గొమ్ము కొత్తగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు, యూనిట్ ఇంచార్జి బాచినేని మల్లేశ్వరరావు , నలజాల మదు, పాటి సంపత్, నలజాల శ్రీకాంత్ , విజ్జగిరి రవితేజ , పాలడుగు నవీన్ , స్రవంతి , మాజీ ఎంపీపీ రమాదేవి, మాజీ జెడ్పిటిసి గోడేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
