HomeAndhra Pradeshమన్యంలో వరినాట్లుకడుపు నింపే ఆశలతో రైతన్నల ఆనందం

మన్యంలో వరినాట్లుకడుపు నింపే ఆశలతో రైతన్నల ఆనందం

చింతపల్లి జిల్లావాణి ప్రతినిధి అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలో
ప్రకృతి రమణీయమైన అల్లూరి మన్యంలో చిన్నపాటి వర్షాలు పడడంతో రైతన్నల కళ్ళల్లో ఆనందం పులకరించింది. ఆకాశం కరుణించడంతో పొలాల్లోకి దిగి వరి నాట్లు ముమ్మరంగా నడుపుతు న్నారు. బురదలోనే బంగారం అడవి బిడ్డలు పొలాలలో కనిపిస్తు న్నట్లుగా ఆడ, మగ తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి దమ్ము చేసిన పొలాల్లో నారు నాటే పనిలో నిమగ్నమయ్యారు. మోకాళ్ల లోతు నీరు, బురదలో నిలబడి ఒక్కో నారును ప్రేమగా నాటుతున్నారు. కొండల మధ్య, పచ్చని చెట్ల నడుమ సాగుతున్న ఈ దృశ్యం మన్యం రైతుల కష్టాన్ని కళ్ళకు కడుతోంది.

వర్షమే రైతుకు వరం ఈ ఏడాది అక్కడక్కడా పడిన వర్షాలతో రైతుల్లో కొత్త ఆశ చిగురించింది. వర్షం బాగా పడితే పంట చేతికొస్తుంది. అప్పులు తీర్చుకుని పిల్లలను చదివించుకోవచ్చు అనేదే ప్రతి రైతన్న మాట. సమైక్యతే బలం యంత్రాలు తక్కువ, మనుషుల కష్టం ఎక్కువ. ఒకరికొకరు సాయం చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ నాట్లు వేయడం మన్యం సంప్రదాయం. ఈ సమైక్యతే వారి బలం.

విత్తనాల ఖర్చు, ఎరువుల ధరలు పెరిగినా, అటవీ జంతువుల బెడద ఉన్నా రైతన్నలు వెనుకడుగు వేయడం లేదు. మేం కష్టపడితేనే దేశానికి అన్నం దొరుకుతుంది అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. మన్యంలో ప్రతి నారు నాటు వెనుక ఒక కుటుంబ కల, కోట్లాది మంది ఆకలి దాగి ఉంది. గ్రామంలో ఒక రైతు కదుల శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుకి ప్రభుత్వాలు చేతుడుగా ఉండి రైతు పండించే ప్రతి పంటకు తిట్టుబాటు ధర ఇస్తూ రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని ప్రభుత్వాలకి రైతు శ్రీనివాసు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular